Advertisement
Google Ads BL

క్లాసిక్స్‌తో కామెడీ చేస్తోన్న కోన...!


క్లాసిక్స్‌తో కామెడీ చేయడం అలవాటైపోయింది  రచయిత కోనవెంకట్‌కు. అందరు కథలతో, కాంబినేషన్‌తో తమ  ప్రాజెక్ట్స్‌కు క్రేజ్‌ తెస్తుంటే ఈ రచయిత మాత్రం సినిమా టైటిల్స్‌ విషయంలో సరికొత్త పంథాతో వ్యహరిస్తున్నాడు.  నిన్న గాక మొన్న నాగార్జున`మణిరత్నంల క్రేజీ క్లాసిక్‌ ‘గీతాంజలి’తో కామెడీ చేయించిన కోనవెంకట్‌ ప్రస్తుతం మరో అడుగు ముందుకేశాడు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని అజరామరమైన ‘శంకరాభరణం’ టైటిల్‌తో నిఖిల్‌తో సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు కోనవెంకట్‌. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. దాంతోపాటు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నాడు. బీహార్‌ నేపథ్యంలో సాగే ఓ క్రైమ్‌ కామెడీగా ఈ చిత్రం రూపొందనుంది. పాత ‘శంకరాభరణం’కు సంబంధం లేకపోయినా ఆ టైటిల్‌ను ఏమాత్రం చెడ్డగొట్టే విధంగా తమ చిత్రం ఉండదనే హామీ ఇస్తున్నాడు కోన. కాగా ఈ చిత్రం ద్వారా ఉదయ్‌ నందనవనం అనే కుర్రాడు దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ప్రవీణ్‌ లక్కిరాజు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మరో మూడు నెలలపాటు హీరో నిఖిల్‌ యాక్టింగ్‌ కోర్సులో బిజీగా ఉండనుండటంతో ఈ చిత్రాన్ని మూడు నెలల తర్వాత ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs