మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీమంతుడు’ (వర్కింగ్‌టైటిల్) సినిమా ఓవర్‌సీస్ రైట్స్ రికార్డు రేటును అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఉగాదికానుకగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఓవర్‌సీస్ రైట్స్‌ను క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ
8.1కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం. ఇంతకు ముందు ఈ రికార్డు పవన్‌కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’, మహేష్, వెంకటేష్‌లు కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రాల పేరిట ఉండేది. మొత్తానికి ‘శ్రీమంతుడు’తో మహేష్ తన రికార్డును తానే బద్దలు కొట్టినట్లు అయిందని ఆయన అభిమానులు ఆనందపడుతున్నారు.
Advertisement
CJ Advs