లెక్కల మాష్టార్ సుకుమార్ ఇటీవల తాను తీసిన మహేష్‌బాబు ‘1’ (నేనొక్కడినే) చిత్రాన్ని ఎక్కువ భాగం యూకెలో తీశాడు. ఆ చిత్రం ఫ్లాఫ్ అయింది. అయినా ఆయన ప్రస్తుతం తన తాజా చిత్రం ఎన్టీఆర్‌తో చేసే సినిమాను కూడా యూకెలోనే ఎక్కువభాగం తీయడంతోపాటు అక్కడే ప్రారంభోత్సవం చేసే ఉద్ధేశ్యంలో ఉన్నాడు. లండన్‌లో ఈ చిత్రం ఓపెనింగ్ జరపాలని నిర్ణయించుకున్నాడు. వాస్తవానికి లండన్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేసే చిత్రాలకు ఆ ప్రభుత్వాలు బడ్జెట్‌లో 40శాతం తిరిగి ఇస్తారు. తమ దేశాల టూరిజంను అభివృద్ది చేయడానికి ఆయా దేశాలు ఈ పద్దతిని అవలంభిస్తున్నాయి. ఇదే విధంగా ‘1’ ఫ్లాప్ అయినప్పటికీ దాదాపు 15కోట్ల వరకు ఈ చిత్రానికి సబ్సిడీ రూపంలో వచ్చింది. అందుకే సుకుమార్ మాస్టార్ ఈ సారి ఎన్టీఆర్ చిత్రాన్ని కూడా అక్కడే ఎక్కువ భాగం తీయడానికి రెడీ అవుతున్నాడు.