‘చిన్నదాన నీకోసం’ చిత్రం తర్వాత హీరో నితిన్ అక్కినేని అఖిల్ సినిమాను నిర్మిస్తూ దాంతోనే బిజీగా గడుపుతున్నాడు. కాగా తాజాగా నితిన్‌కి ఓ బంపర్‌ఆఫర్ తగిలిందని సమాచారం. త్వరలోనే ఆయన క్రియేటివ్ జీనియస్ గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈలోగా ‘కొరియర్‌బోయ్ కళ్యాణ్’ చిత్రం ముస్తాబు అవుతోంది. ఈ చిత్రానికి గౌతమ్‌మీనన్ నిర్మాత కావడం గమనార్హం. ఇప్పుడు ఆయన తన దర్శకత్వంలోనే నితిన్‌కు ఓ చాన్స్ ఇచ్చాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కబోతోంది. తమిళంలోనూ నితిన్ నటిస్తాడా? లేక మరో హీరోని
ఎంచుకుంటారా? అనేది తేలాల్సివుంది.
Advertisement
CJ Advs