వర్తమాన వ్యవహారాలను తన సినిమా కథలుగా మలచుకోవడంలో కమల్‌హాసన్ స్థితప్రజ్ఞుడు. అలాంటి మరో కథ ఇప్పుడు ఆయనకు దొరికింది. 2014లో మలేషియా విమానం అదృశ్యమైన సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్ని విధాల గాలించినా కనీసం విమాన శకలాలు కూడా కనుక్కోలేకపోయారు. ఆ విమానం సముద్రంలో కూలిందా? లేదంటే ఎవరైనా హైజాక్ చేశారా? అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ దుర్ఘటన కమల్‌ని బాగా ఆకర్షించిందిట. ఈ నేపథ్యంలో ఆయన ఓ సినిమాని చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ సమాచారం. ఇటీవలే కమల్ మారిషస్ వెళ్లి అక్కడ కొన్ని లొకేషన్లు కూడా చూసొచ్చాడట. మరి కమల్ ఈ చిత్రాన్ని ఎప్పుడు? ఎవరికి చేస్తాడు? అనేది సస్పెన్స్‌గా మారింది.