పశ్చాత్తాపపడుతోన్న సన్నిలియోన్‌!


సన్నిలియోన్‌ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో సెటిలైన ఈ అమ్మడు ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తన గత జీవితాన్ని తలుచుకుని బాధపడుతోంది. 15ఏళ్లకే అన్ని అనుభవాలు పొందాను. భారతీయ సాంప్రదాయాలు ఎంత మహోన్నతమైనవో తనకు ఇప్పుడు తెలిసిందని చెప్పుకొచ్చింది. ఇంకా మాట్లాడుతూ... గతంలో తాను చేసిన తప్పులకి ఇప్పుడు తలదించుకుంటున్నానని ఆంటూ బాధపడిరది. తన సంతతి భారతదేశంలోనే ఉన్నప్పటికీ తాను మాత్రం విదేశాల్లో ఉండటం వల్లనే ఈ సాంప్రదాయాలు, కట్టుబాట్లు తనకు తెలియవని తెలిపింది. భారతీయ మహిళలది మహాఔన్నత్యమైన స్వభావమని, తనదైన వ్యక్తిత్వం కలవారని, తమ పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవం తీసుకొస్తారని చెప్పింది. ఈ దేశం వచ్చాక తాను చేసిన తప్పులు తలుచుకుంటుంటే చాలా బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES