సినీ పరిశ్రమలో ఏ ట్రెండ్ నడుస్తున్నప్పటికీ ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ చిత్రాల హవా ఎప్పుడూ తగ్గలేదు. వాటిని బాగా రక్తి కట్టిస్తే హిట్ తప్ప ఫ్లాప్ రాదు. అలాంటి చిత్రాలను తీయడంలో ఇప్పుడు స్టార్ రైటర్, అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పి.హెచ్.డి. చేసినట్లున్నాడు. 'అత్తారింటికి దారేది' చిత్రం ముందువరకు టాలీవుడ్ విషయానికి వస్తే అత్త అంటే గయ్యాళి. ఆమె పొగరు అణచి ఆమె కూతుర్లతో డ్యూయెట్స్ పాడటమే హీరో పని. కానీ 'అత్తారింటికి దారేది' చిత్రంలో అత్త అంటే అమ్మ అని, ఆ ఆప్యాయతలను, అనుబంధాలను ఆయన చక్కగా చూపించి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. తాజాగా ఆయన అల్లుఅర్జున్ తో చేస్తున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం టైటిలే కాదు. దానికి పెట్టిన 'విలువలే ఆస్థి' అనే ఉపశీర్షిక కూడా ఈ చిత్రం కుటుంబ బంధాలు, అనుబంధాలతో నిండి ఉంటుందని అర్ధం అవుతోంది. మరి ఈ 'సన్నాఫ్ సత్యమూర్తి' విడుదలైన తర్వాత ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తాడో వేచిచూడాల్సివుంది..!