ఇటీవలే అజిత్ హీరోగా 'ఎన్నై అరిందాల్'(తెలుగులో 'ఎంతవాడు కానీ') చిత్రంతో భారీ హిట్టుకొట్టిన దర్శకుడు గౌతమ్ మీనన్. కాగా గౌతమ్ వాస్తవానికి హీరో సూర్య కోసం ఓ స్టొరీని తయారుచేసిపెట్టుకున్నాడు. కానీ ఎంతకీ సూర్య ఒక పట్టాన ఒప్పుకోకుండా పడే పడే మార్పులు చేర్పులు అంటూ విసిగించడంతో ఈ స్టొరీని పక్కన పెట్టిన గౌతమ్ 'ఎన్నై అరిందాల్' చిత్రం తీశాడు. తాజాగా ఆయన సూర్యతో తీయలనుకొన్న స్టొరీని మరలా లైమ్ లైట్ లోకి తెచ్చి విక్రమ్ హీరోగా ఆ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. కాగా ఈ చిత్రంలో విక్రమ్ కు జోడీగా నయనతారకు హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఆసక్తికర కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంలోని దర్శకుడు, హీరో, హీరోయిన్.. ఇలా అందరూ టాలీవుడ్ కి సుపరిచితమైన వారే కావడంతో ఈ చిత్రాన్ని ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయాలనే ప్లానింగ్ లో గౌతమ్ మీనన్ ఉన్నట్లు సమాచారం.