టాలీవుడ్ కు తొలిసారిగా 'దేశముదురు' చిత్రంతో సిక్స్ ప్యాక్ ని పరిచయం చేసిన హీరో అల్లు అర్జున్. అప్పటినుంచి బన్నీకి స్టైలిష్ స్టార్ అనే బిరుదు వచ్చింది. యువతలో ఆయనకు క్రేజ్ తెచ్చిన అంశాల్లో సిక్స్ ప్యాక్ కూడా ఒకటి. ఇప్పుడు బ్రదర్ ఆఫ్ బన్నీ.. అదేనండి అల్లువారి మరో అబ్బాయి అల్లుశిరీష్ సిక్స్ ప్యాక్ కోసం తెగ కష్టపడుతున్నాడట. అన్నయ బాటలోనే నడుస్తూ.. సిక్స్ ప్యాక్ చేయనున్నాడు. ఆయన నటించిన మొదటి రెండు చిత్రాలు 'గౌరవం, కొత్తజంట' ప్రేక్షకులను నిరాశపరచడంతో ఇప్పుడు తన తాజా చిత్రం కోసం అల్లుశిరీష్ ఈ విధంగా కష్టపడుతున్నాడు. కాగా ప్రస్తుతం దర్శకుడు పరశురాం అల్లుశిరీష్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.