నాగార్జున ప్రధాన పాత్రలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కధానాయకులు. నూతన దర్శకుడు కళ్యాన్ కృష్ణ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. పల్లెటూరు నేపధ్యంలో సాగే ఈ కథలో నాగార్జున రెండు పాత్రలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 'మనం' సినిమా నుండి నాగార్జున విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. అలానే ఈ చిత్రంలో కూడా నాగార్జున ఎన్నడూ నటించని ఓ ఆత్మ రూపంలో కనిపించనున్నట్లు సమాచారం. తాత, మనువడి పాత్రలో నటించే నాగార్జున మనువడికి సలహాలు ఇవ్వడానికి ఆత్మ రూపంలో వస్తాడని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుందట. మరి ఈ విషయాలు నిజమో కాదో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది.