Advertisement
Google Ads BL

ఓకే మణిరత్నం...!


ఇటీవల వరుసగా ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్న మణిరత్నం తన తాజా క్యూట్‌ లవ్‌స్టోరీ ‘ఓకే కన్మణి’ ద్వారా మరలా ఫామ్‌ను అందుకున్నట్లే కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగులో విడుదల చేయనుండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది.ఈ చిత్రానికి నిత్యామీనన్‌ నటన, పి.సి.శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ, ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం వంటివి హైలైట్‌ కానున్నాయి. ఈచిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి తనయడు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.కాగా ఈ పాత్రకి ప్రముఖ తెలుగు హీరో నాని చెప్పిన డబ్బింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. మరి ఈ చిత్రం మరలా మణిరత్నంను ఫామ్‌లోకి తేవడమా? లేక తెరమరుగుచేయడమా? అనేది ఖాయమని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs