లెజెండ్, లయన్, డిక్టేటర్ వంటి పవర్ ఫుల్ టైటిల్స్ కు సూట్ అయ్యే స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. 'లెజెండ్' తరువాత ఆయన నటిస్తున్న'లయన్' చిత్రంపై ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగాయి. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య కనిపించనున్నాడు. సత్యదేవ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం అవబోతున్నాడు. మణిశర్మ స్వరాల్ని అందించిన ఈ సినిమా ఆడియో ఈనెల 28 న రిలీజ్ కానుంది. బాలకృష్ణ నటించిన 'లెజెండ్' సినిమా ఆడియో కూడా క్రిందటి సంవత్సరం మార్చి 28 నే రిలీజ్ అయింది. దీంతో 'లెజెండ్' సెంటిమెంట్ ఈ సినిమాకు వర్కవుట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మణిశర్మ, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు 'సమరసింహారెడ్డి' , 'నరసింహనాయుడు' ఎంత పెద్ద హిట్స్ గా నిలిచాయో తెలిసిందే. మళ్ళీ అదే కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో వేచి చూడాలి..!