Advertisement
Google Ads BL

తమిళ్ 'పటాస్'లో హీరో ఎవరు..?


కళ్యాణ్ రామ్, శ్రుతిసోది జంటగా నటించిన సినిమా 'పటాస్' తెలుగులో ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. అయితే ఈ చిత్రం తమిళ రీమేక్ రైట్స్ ను ఆర్.బి.ఎస్ చౌదరి సొంతం చేసుకోగా వారి తనయుడు జీవా హీరోగా తమిళ వెర్షన్ లో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను చూసిన జీవా మాత్రం కళ్యాణ్ రామ్ పాత్ర తనకు సూట్ అవదేమో అని ఆలోచిస్తున్నాడట. దీంతో కోలీవుడ్ లో హీరోగా ఎవరు నటిస్తారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ హీరో శివకార్తికేయ ఈ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కాని కోలీవుడ్ లో తెరకెక్కించే ఈ సినిమాలో కొన్ని మార్పులు చేయనున్నారని తెలుస్తుంది. మరి కోలీవుడ్ లో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి..!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs