స్వామిరారా, కార్తికేయ వరుస విజయాల తర్వాత నిఖిల్ నటించిన హాట్రిక్ ఫిలిం ‘సూర్య వర్సెస్ సూర్య’ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం రివ్యూస్ పరంగా ఎబో యావరేజీగా నిలిచిన కలెక్షన్ల పరంగా అందరిని విస్మయానికి గురిచేస్తుంది. ఈ చిత్రం తొలిరోజే తెలంగాణ, ఎపీలో కలిపి 2కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలిసింది. ఓ సరికొత్త పాయింట్‌తో రూపొందిన ఈ చిత్రంలో నిఖిల్ అభినయం, ఫోటోగ్రఫీ చిత్రానికి మెయిన్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి మౌత్‌టాక్ బిగ్ ఎస్సెట్‌గా నిలిచింది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులందరికి మా చిత్రం నచ్చుతుందని చిత్ర యూనిట్ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రంతో హీరోగా నిఖిల్ కమర్షియల్ రేంజ్ పెరిగిందని ట్రేడ్‌వర్గాలు చెబతున్నాయి.