‘పిల్లా..నువ్వులేని జీవితం’తో హిట్ కొట్టిన మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ నటించిన మొదటి చిత్రం ‘రేయ్’ విడుదలకు సిద్దంగా ఉంది. మరోవైపు ఆయన ప్రస్తుతం ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. కాగా కన్నడలో గత ఏడాది క్రిస్‌మస్‌కు విడుదలైన ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో సాయిదరమ్‌తేజ్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ కన్నడ నిర్మాత ఎస్.ఎన్.రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సిద్దపడుతున్నాడు. ఇదే కనుక ఫైనల్ అయితే సాయి ఖాతాలో మరో హిట్ పడటం ఖాయమని అంటున్నారు.