Advertisement
Google Ads BL

సమ్మర్‌ సీజన్‌కు బోణీ కొట్టనున్న గోపీచంద్‌..!


‘లౌక్యం’ హిట్‌తో మంచి ఊపుమీదున్న గోపీచంద్‌, రాశిఖన్నా జంటగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ‘మిర్చి, రన్‌రాజారన్‌’ చిత్రాల తర్వాత యువి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న చిత్రం ‘జిల్‌’. ఈ చిత్రాన్ని ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఆడియోను ఈనెల 12న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్ర నిర్మాతలకు మంచి మిత్రుడైన హీరో ప్రభాస్‌ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రానున్నాడని సమాచారం. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తయింది. వేసవి సీజన్‌కు బోణీ కొట్టేందుకు గోపీచంద్‌ సిద్దం అవుతున్నాడు. ఈ సినిమా సక్సెస్‌ అయితే వరుసగా తొలి మూడు సినిమాలను హిట్స్‌గా తమ ఖాతాలో వేసుకొన్న ఖ్యాతి నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లకు దక్కుతుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs