హీరోగా జగపతిబాబు పనైపోయింది అనుకునే సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం సత్పలితాలను ఇస్తోంది.‘లెజెండ్’తో విలన్‌గా మారిన ఆయన ఆ తర్వాత యంగ్ హీరోల తండ్రి పాత్రలకు సైతం ముందుకు వచ్చాడు. ఇలా తనకి ప్రాదాన్యం ఉన్న ఏ పాత్రనైనా చేసేందుకు జగపతిబాబు ముందుకు రావడంతో మన దర్శకరచయితలు ఆయనకు అనుగుణంగా క్యారెక్టర్లను తీర్చిదిద్దే పనిలో పడ్డారు. తాజాగా ఆయన ఇద్దరు స్టార్‌హీరోలకు తండ్రిగా నటిస్తున్నాడని సమాచారం. మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీమంతుడు’ చిత్రంలో మహేష్‌కు తండ్రిగా నటిస్తున్న ఆయన తాజాగా ఎన్టీఆర్, సుకుమార్‌ల చిత్రంలో సైతం ఎన్టీఆర్‌కు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాడని సమాచారం. మొత్తానికి తన మంచి నిర్ణయంతో తనకే కాదు.. సినీపరిశ్రమకు కూడా బాగా పనికివచ్చే క్యారెక్టర్‌గా ఆర్టిస్టుగా మారిన జగపతిబాబుకు మరో పదేళ్లు తిరుగుండదని చెప్పవచ్చు అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.