అల్లుఅర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (వర్కింగ్‌టైటిల్). ఈ చిత్రం ఇంకా పూర్తి కాకముందే మాటీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేశారు. ఇందుకోసం వారు ఏకంగా 9.5కోట్లు మొత్తాన్ని వెచ్చించినట్లు సమాచారం. అల్లుఅర్జున్, త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ల చిత్రాలకు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండటంతో ఇంత పెద్ద మొత్తాన్ని మాటీవీ ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ‘జులాయి’ నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సమంత, ఆదాశర్మ, నిత్యామీనన్, కన్నడస్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, సింధుతులాని, వెన్నెలకిషోర్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని వేసవికానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.