తన సర్వస్వాన్ని ఫణంగా పెట్టి దర్శకనిర్మాత గుణశేఖర్ ‘రుద్రమదేవి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్నారు. అనుష్క, రానా, నిత్యామీనన్‌లతో పాటు ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండటంతో ఈ చిత్రానికి తమిళంలో మంచి క్రేజ్ ఏర్పడిందని, ఈ చిత్రం తమిళ వెర్షన్ హక్కులను 10కోట్లకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే దాదాపు 50కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న గుణశేఖర్‌కు ఎంతో కొంత ఊరట లభించినట్లే అంటున్నాయి ట్రేడ్‌వర్గాలు. అయినా కేవలం తెలుగు ప్రజలకు మాత్రమే తెలిసిన ‘రుద్రమదేవి’ చరిత్ర ఇతర భాషల వారిని ఎలా ఆకట్టుకుంటుందో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరికొందరు....!