కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ లో వచ్చే చిత్రాలన్నీ ఒకే రీతిలో ఉంటున్నాయి. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆ సినిమాలన్నీ బోర్ కొట్టించే విధంగా ఉంటున్నాయి. అయితే టాలీవుడ్ కి పరిచయమైన కొత్త ఫిల్మ్ మేకర్స్ మాత్రం రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ ప్రేక్షకులను అలరించే విధంగా చిత్రాలను చిత్రీకరిస్తున్నారు. రీసెంట్ గా రివీల్ అయిన 'సూర్య వర్సెస్ సూర్య' సినిమా పోస్టర్స్ , ట్రైలర్స్ చూస్తుంటే విభిన్నమైన చిత్రంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో సూర్యుడు అంటే పడని ఓ వ్యాదితో(పోర్ ఫిరియా) హీరో కనిపిస్తాడు. ఇలాంటి ఓ కాన్సెప్ట్ తో టాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న హీరో నిఖిల్ సరసన ఈ సినిమాలో త్రిదా చౌదరి నటిస్తోంది. మార్చి 5 న విడుదలయ్యే ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!