కమెడియన్‌గా పీక్ స్టేజీలో ఉండి రోజుకు లక్షకు పైగా వసూలు చేస్తూ ప్రతి రోజు విరామం లేకుండా పనిచేస్తున్న సునీల్ హీరోగా మారిన తర్వాత రెంటికి చెడ్డ రేవడి అయ్యాడని అంటున్నారు. హీరోగా రెండు మూడు హిట్లు వచ్చినప్పటికీ ‘మిస్టర్ పెళ్లికొడుకు, భీమవరం బుల్లోడు’ వంటి డిజాస్టర్ చిత్రాల తర్వాత దాదాపు ఏడాదిగా ఖాళీ ఉన్నాడు. సునీల్‌తో మేము తీస్తున్నాం.. మేము తీస్తున్నాం.. అని నిర్మాత దర్శకులు ప్రకటిస్తున్నప్పటికీ ఒక్క సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్లడం లేదు. తనికెళ్లభరణి దర్శకత్వంలో ఒకటి, రచయిత గోపీమోహన్ దర్శకత్వంలో మరోటి, దిల్‌రాజు, వాసువర్మల కాంబినేషన్‌లో ఇంకో చిత్రం, తాజాగా ‘రక్ష’ దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో మరో సినిమా అనౌన్స్ చేశాడు. అయితే వీటిల్లో ఏ సినిమా ముందుగా సెట్స్‌పైకి వెళ్తుందో తెలియని పరిస్థితి.. ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని సందిగ్ధత నెలకొని ఉన్నాయి. మొత్తానికి సునీల్‌కు హీరోగా బ్యాడ్‌టైమ్ నడుస్తోందనే చెప్పాలి...!