టాలీవుడ్ లో అగ్రనిర్మాత అండ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యుసర్ గా పేరున్న దిల్ రాజు మరలా తనకు ఇంతటి పేరును తీసుకొచ్చిన చిన్న చిత్రాల వైపు.. ఫీల్ గుడ్ వైపు దృష్టిసారించాడు. తాజాగా ఆయన తన బేనర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'కృష్ణాష్టమి' అనే మంచి టైటిల్ ను ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. మరి ఈ చిత్రాన్ని ఎవరితో నిర్మించనున్నాడు? అనే విషయం మాత్రం ఇంకా తెలియరావడం లేదు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న 'కేరింత' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో మరో నిర్మాత యమ.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తుండగా, 'వినాయకుడు' ఫేమ్ సాయికిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.