సినిమా ఇండస్ట్రీలో 37 సంవత్సరాలుగా కళాకారునిగా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు నటుడు రాజేంద్రప్రసాద్. నటుడుగానే కాకుండా సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ నెలాఖరులో జరగబోయే 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్' ఎన్నికలలో పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ "హీరోగా, తండ్రిగా, భర్తగా నా భాద్యత నెరవేర్చాననే అనుకుంటున్నాను. నా సమయాన్ని కొంత సేవా కార్యక్రమాల కోసం వెచ్చించాలని భావిస్తున్నాను. అనేకసార్లు నన్ను ఈ విషయం గురించి ప్రశ్నించినా దీని గురించి చెప్పడానికి ఇదే మంచి సమయం అని భావించి మీకు తెలియజేస్తున్నాను. ఈ నెలలో జరగబోయే 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్' ఎన్నికలలో పోటీ చేస్తున్నాను. ప్రేక్షకుల, ఇండస్ట్రీలో ఉన్న అందరి సహాయ సహకారాలు నాకు ఉంటాయని భావిస్తున్నా" అని చెప్పారు.