Advertisement
Google Ads BL

నయనతార భయపెడుతుందట!


నయనతార తమిళంలో మరో ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ చేస్తోంది. హర్రర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి 'మాయ' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు 'మయూరి' అనే టైటిల్ ను కన్ ఫర్మ్ చేసినట్లు సమాచారం. గతంలో తెలుగులో ఉషాకిరణ్ మూవీస్ సంస్థలో 'మాయురి' అనే టైటిల్ తో సినిమా వచ్చి ఎంతో  ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. 'అనామిక' తర్వాత నయనతార నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ఇదే కావడం గమనార్హం. 'మయూరి'గా నయనతార ప్రక్షకులను భయపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs