Advertisement
Google Ads BL

మెగా సందడి స్టార్ట్ అవ్వబోతుంది..!


'జులాయి' తర్వాత అదే కాంబినేషన్ లో వస్తున్న  చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి'. ఈ చిత్రానికి కూడా దేవీశ్రీప్రసాదే సంగీతం అందిస్తున్నాడు. వాస్తవానికి బన్నీ-దేవీశ్ర్రీ లది హిట్ కాంబినేషన్. అదే సమయంలో త్రివిక్రమ్-దేవీశ్ర్రీ లది కూడా మ్యూజికల్ హిట్ కాంబినేషన్. మరి వీరందరి కాంబినేషన్ లో రూపొందుతున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం ఆడియో 'జులాయి' కంటే పెద్ద మ్యూజికల్ హిట్ అవుతుందని మెగాభిమానులు ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈ చిత్రం ఆడియోను మార్చి 8వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి చివరివారంలో లేదా ఏప్రిల్ మొదటివారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి నిర్మాత రాధాకృష్ణ అనే విషయం విదితమే.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs