టాలీవుడ్ లో టైటిల్స్ ట్రెండ్ ను కూడా కొంత మంది దర్శకనిర్మాతలు ఫాలో అవుతుంటారు. తాజాగా 'సుబ్రహ్మణ్యం' పేరుతో రెండు సినిమాలు, 'టైగర్' పేరుతో రెండు చిత్రాలు రూపొందుతున్నాయి. నాని హీరోగా స్వప్న సినిమా పతాకంపై ప్రియాంకాదత్ నిర్మిస్తోన్న చిత్రం 'ఎవడే సుబ్రహ్మణ్యం'.. కాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం పేరు 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'. ఇక మరో టైటిల్ విషయానికి వస్తే యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న చిత్రం పేరు 'టైగర్' కాగా రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం పేరు 'బెంగాల్ టైగర్'. ఇలా ఒకే పోలికతో టైటిల్స్ పెట్టే సరికి ఆడియన్స్ కాస్త కన్ ఫ్యూజన్ కు గురవుతున్న మాట వాస్తవం.