Advertisement
Google Ads BL

మదర్‌ థెరిస్సాను గుర్తుకు తెచ్చిన కేజ్రీవాల్‌..!!


అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మరోసారి ఢిల్లీ పీఠం ఎక్కిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీని ఆకట్టుకునేలా తన పాలనను సాగిస్తున్నారు. వారం వారం జనతా దర్బార్‌ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. ఇక ఈ శుక్రవారం ఆప్‌ పార్టీ  కార్యాలయంలో నిర్వహించిన జనతా దర్బార్‌కు ఓ కుష్ఠు రోగుల బృందం వచ్చి సీఎం కేజ్రీవాల్‌ను కలుసుకుంది. పదేండ్లుగా తమను పట్టించుకునే వారు కరువయ్యారని, తమను సమాజం నుంచి వెలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కష్టాలు విని చలించిపోయిన కేజ్రీవాల్‌ వెంటనే వారిని మనసారా హత్తుకున్నట్లు తెలిసింది. అయితే అరవింద్‌ కేజ్రీవాల్‌ తమ సమస్యల పరిష్కారాని హామీ ఇస్తారని తమకు తెలుసునని, అయితే తమను హత్తుకొని మరీ ఓదారుస్తాడని మాత్రం ఊహించలేదని కుష్ఠు రోగుల బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఇక కుష్ఠు రోగులకు సేవలందించిన మదర్‌ థెరిస్సాను అరవింద్‌ గుర్తుకు తెచ్చారంటూ ఆప్‌ కార్యకర్తలు చెబుతున్నారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs