పొన్నాల లక్ష్మయ్య టీపీసీసీ చీఫ్‌పోస్టు ఊడటం ఖాయమైపోయింది. కొన్నాళ్లుగా రాష్ట్ర రాజకీయ నాయకులు పొన్నాలపై అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తున్నారు. పార్టీని గాడిలో పెట్టకుండా పొన్నాల వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, టీడీపీ సహ ఇతర పార్టీలు సభ్యత్వ నమోదులో దూసుకెళ్తుంటే కాంగ్రెస్ మాత్రం చేష్టలుడిగి చూస్తుందని వారంతా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇక తన పదవికి ముప్పు పొంచి ఉందని గ్రహించిన పొన్నాల బుధవారమే ఢిల్లీకి వెళ్లి పైరవీలు మొదులపెట్టాడు. తనను టీపీసీసీ చీఫ్ పోస్టునుంచి తొలగించవద్దని బతిమిలాడినా అధిష్టానం వినిపించుకునే స్థితిలో లేకపోవడంతో మరో ఆఫర్ ఇచ్చాడు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇచి.. టీ పీసీసీ పోస్టునుంచి తొలగించినా పర్వలేదని ఏకంగా పొన్నాల అధిష్టానానికే ఆఫర్ ఇచ్చాడు. దీనిపై కూడా పార్టీ హైకమాండ్ స్పష్టతనివ్వన్నట్లు సమాచారం. ఇక ఆదివారం పొన్నాలను పదవినుంచి తొలగించి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసే అవకాశముంది. ఇక అదే సమయంలో భట్టి విక్రమార్కకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించనున్నారు.