అక్కినేని అఖిల్ హీరోగా తెరంగేట్రం చేస్తోన్న మూవీ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొద్దిపాటి ఫాంటసీ అంశాలతో ఈ చిత్రాన్ని వినాయక్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఎక్కువ భాగం షూటింగ్ అడవి నేపధ్యంలో సాగనుందని, అందుకోసం ఈ టీమ్ సౌతాఫ్రికాలోని అడవుల్లో షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అఖిల్ ఇంట్రడక్షన్ ఫైట్ ను ఇటీవల భారీగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కేవలం ఈ ఒక్క ఫైట్ కోసం దాదాపు కోటిరూపాయలకు పైగా ఖర్చుపెట్టినట్లు, సినిమాలోని ప్రతి సీన్ ను అంతే రిచ్ గా తెరకెక్కించడానికి నిర్మాత నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి లు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది.