Advertisement
Google Ads BL

వెరైటీ లుక్ లో మెగామేనల్లుడు....!


మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మూడో చిత్రం 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడు.  టైటిల్ పరంగా ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కు సంబంధించిన ఓ ఫోటోను ఇటీవల విడుదల చేశారు. ఇందులో సాయి డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ లుక్ అభిమానులను బాగా అలరిస్తోంది. సమ్ థింగ్ స్పెషల్ అనిపించేలా ఉన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.  దేశంలోని పలు లోకేషన్లలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం చివరి షెడ్యుల్ ఏప్రిల్ లో అమెరికాలో జరుగుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs