తన సక్సెస్ సీక్రెట్ విభిన్నతకు చోటివ్వడమే అంటాడు తమిళ స్టార్ ధనుష్. కమల హాసన్, విక్రమ్, సూర్యల తర్వాత అంతటి వెరైటీని చూపించే హీరో ఆయన. కేవలం తనకు సూట్ అయ్యే.. తన ఫిజిక్ కు ఓకే అయ్యే చిత్రాలను మాత్రమే ఆయన ఎంచుకుంటూ ఉంటాడు. 'రంగం' ఫేమ్ కె.వి.ఆనంద్ దర్శకతంలో ధనుష్ హీరోగా నటించిన 'అనేగన్' చిత్రం ఇటీవల తమిళంలో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో నాలుగు రకాల గెటప్స్ లో కనిపించిన ధనుష్ నటనకు తమిళ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే దాదాపు 50 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని చూసి దర్శకుడు కె.వి.ఆనంద్ టాలెంట్ కు ముచ్చటపడిన సూపర్ స్టార్ రజనీ తన తాజా చిత్రాన్ని అయన దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. 'అనేగన్' చిత్రం తెలుగులో 'అనేకుడు'గా విడుదల కానుంది. మరి ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచిచూడాల్సివుంది...!