ఎనర్జిటిక్ యాక్టర్ హీరో రామ్ రెండు సంవత్సరాలుగా చెప్పుకోదగ్గ హిట్ సినిమా చేయలేకపోయాడు. 'రెడీ' సినిమా తరువాత ఆ రేంజ్ లో హిట్ కొట్టాలని కొన్ని సినిమాలు తీసి ప్రయత్నించినా అవి బాక్సాఫీస్ దగ్గర ఏవరేజ్ గా నిలిచాయి. ప్రస్తుతం రామ్ 'పండగ చేస్కో' , 'శివం' సినిమాలలో నటిస్తున్నాడు. అయితే రామ్ తన ట్విట్టర్ లో 'పండగ చేస్కో' లాస్ట్ షెడ్యూల్ కి రెడీ గా ఉంది, 'శివం' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది అని ట్వీట్ చేసాడు. దీంతో రామ్ రెండు సినిమాలను 2015 లోపు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ టాక్. 2013 లో రామ్ నటించిన 'ఒంగోలు గిత్త' , 'మసాల' సినిమాలు బ్యాక్ తో బ్యాక్ రిలీజ్ చేసి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాడు. మరి అదే తరహాలో రామ్ ఈ సంవత్సరం రిలీజ్ చేయబోయే ఈ రెండు సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తాయో వేచి చూడాలి..!