Advertisement
Google Ads BL

తెలుగు సినిమా రీమేక్ లో రన్ వీర్..?


'టెంపర్' సినిమా తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను బండ్ల గణేష్ కు సన్నిహితుడైన సచిన్ జోషి సొంతం చేసుకున్నారు. మొదట్లో ఈ చిత్రానికి హిందీలో హీరో కమ్ ప్రొడ్యూసర్ గా చేసేది సచిన్ జోషి నే అని వార్తలు వచ్చాయి. అయితే సచిన్ మాత్రం హీరోగా నటించమని బాలీవుడ్ లో ఓ స్టార్ హీరోను సంప్రదించారట. భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసాడట. దీంతో సచిన్ కేవలం నిర్మాణ బాధ్యతలు మాత్రమే చేపట్టనున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ లో హిట్ సినిమాలో నటించి ప్రస్తుతం 'దిల్ దడ్కనే దో' , 'బాజీరావ్ మస్తాని' సినిమాలో నటిస్తున్న హీరో రన్ వీర్ సింగ్. 'టెంపర్' సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ కి , నటన కి  రన్ వీర్ తప్ప బాలీవుడ్ లో వేరెవరు సూట్ అవలేరని చిత్ర బృందం భావిస్తోందట. మరి రన్ వీర్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరిస్తాడో లేదో చూడాలి.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs