టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. గతంలో పలువురు నటులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఇక సోమవారం రాత్రి అందిన సమాచారం మేరకు పోలీసులు సినిమా డైరెక్టర్ సుశాంత్‌రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించి పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సుశాంత్‌రెడ్డితోపాటు ఇద్దరు నైజీరియన్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరో నైజీరియన్ పరారీలో ఉన్నాడు. ఇక సుశాంత్‌రెడ్డితోపాటు ఇంకా ఎంతమంది సినీ ప్రముఖులు నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు నైజీరియన్ల ఫోన్స్ కాల్స్ లిస్టును పోలీసులు చెక్ చేస్తున్నట్లు సమాచారం. నల్లగొండ జిల్లాకు చెందిన సుశాంత్‌రెడ్డి సూపర్‌స్టార్ అనే సినిమాకు గతంలో దర్శకత్వం వహించాడు.