'బాహుబలి', 'రుద్రమదేవి' చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న అనుష్క తాజాగా మరొక చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది. ఈ సినిమాకి 'సైజ్ జీరో' అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. సోమవారం ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక జరిపారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు కొడుకు కోవెలమూడి ప్రకాష్ భార్య రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అనుష్క లీడ్ రోల్ లో నటించబోయే మరో భారీ బడ్జెట్ ఫాంటసి చిత్రమిది. ప్రముఖ నిర్మాత పి.వి.పి బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. మార్చి నెల నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. కోవెలమూడి ప్రకాష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరాల్ని అందించనున్నాడు.