తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. అదే సమయంలో సమైక్య ఉద్యమంలో కూడా అశోక్‌బాబు నేతృత్వంలో ఏపీ ఉద్యోగులు కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా పోరాడారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా, ఆర్థిక సాయంపై కేంద్రం హామీలిచ్చిందంటే అది ఉద్యోగుల ఉద్యమాల పుణ్యమేనని రాజకీయ నాయకులే చెబుతుంటారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఉద్యోగ సంఘాల నేతలకు కొన్ని కీలక పదవులు లభించాయి. అందులో భాగంగా ఇప్పుడు దేవీప్రసాద్‌కు కూడా పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ సీటును కేటాయించారు కేసీఆర్. ఇక ఏపీ విషయానికొస్తే అక్కడ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అశోక్‌బాబుకు ఎలాంటి పదవి దక్కలేదు. అయితే ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చంద్రబాబు తలుచుకుంటే అశోక్‌బాబుకు ఎమ్మెల్సీ సీటునివ్వడం పెద్ద కష్టం కాదు. అశోక్‌బాబును ఎమ్మెల్సీ చేస్తే లక్షల సంఖ్యలో ఉన్న ఉద్యోగులను కూడా సంతృప్తి పరిచినట్లుంది. మరి ఈ బాబు ఆ బాబును ఎమ్మెల్సీ చేస్తారో లేదో..?