ఆంధ్రప్రదేశ్‌లో పాలనను గాడిలో పెట్టడం చంద్రబాబుకు తలకుమించిన భారంగా మారుతోంది. ఓవైపు రాజధాని నిర్మాణానికి నిధులు లేవని ఆయన మొత్తుకుంటే ప్రతిపక్షాలు మాత్రం రైతులు భూములు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నాయని తెలుగు తమ్ముళ్తు తెగ బాధపడిపోతున్నారు. ఇక రాజధాని నిర్మాణానికి రూ. 1 లక్ష కోట్లు అవుతుందని, అందులో ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల నిర్మాణానికే రూ. 20 వేల కోట్లు కావాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. ఇక విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తమకు రాజధాని నిర్మాణానికి ఆర్థిక కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసింది. అయితే మోడీ ఎదుట బాబు పాచిక అసలు పారడం లేదు. ఈ బడ్జెట్‌లో రాజధాని నిర్మాణానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇక ప్రస్తుతానికి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి కూడా నిధులు లేవని బాబు లేఖ రాసినా కేంద్రం పట్టించుకోలేదు. దీన్నిబట్టి ఇంకా బాబు.. కేంద్రం మీద ఆశలు పెట్టుకుంటే ఆశాభంగం తప్పదేమోననిపిస్తోంది..!