నేటి స్పీడ్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న విషయం తెలిసిందే. దానిని సులభంగా వాడుకొంటున్నారు చాలామంది. దీంతో సినిమా వాళ్లకు కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. సినిమా స్టోరీతో పాటు గెటప్‌లను కూడా రహస్యంగా ఉంచడం కష్టమైపోతోంది. కాగా ఇలా నాగార్జునకు సంబంధించిన ఓ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం నాగార్జున కళ్యాణ్‌కృష్ణ అనే నూతన దర్శకునితో ‘సోగ్గాడే చిన్ని నాయన’ చేస్తోన్న సంగతి తెలిసిందే ఇందులో రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి, హంసానందిని వంటివారు కీలకపాత్రలు పోషిస్తున్నారు.కళ్లజోడు పెట్టుకుని మానిటర్ వంక ఆశ్యర్యంగా చూస్తూన్న నాగార్జునను ఈ ఫొటోలో చూడవచ్చు. ఈ ఫొటోలో హాట్ బామ హంసానందిని కూడా కనిపిస్తోంది. ఈ గెటప్ సినిమాలోని కుర్రనాగార్జున గెటప్ అని తెలుస్తోంది.