Advertisement
Google Ads BL

తారక్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా? లేదా.?


రచయిత వక్కంతం వంశీకి ఎప్పటినుండో డైరెక్టర్‌ కావాలని కోరిక ఉంది. అందుకు అనుగుణంగానే ఆయన టాలెంట్‌ను గుర్తించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ తనకు దర్శకునిగా ఛాన్స్‌ ఇస్తానని ప్రామిస్‌ చేశాడు. ఈ విషయాన్ని అటు తారక్‌తోపాటు వంశీ కూడా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పారు. దాంతో ఎన్టీఆర్‌ను డైరెక్ట్‌ చేయడానికి ఆయన ఓ కథను సిద్దం చేసుకున్నాడు. అదే ‘టెంపర్‌’ అని తెలుస్తోంది. స్టోరీ ఎన్టీఆర్‌కు కూడా నచ్చింది. అయితే అసలే ఫ్లాప్‌ల్లో ఉన్న తాను ఇప్పుడు వంశీతో కలిసి పని చేయడం రిస్క్‌ అని జూనియర్‌ భావించాడట. దాంతో వంశీని ఒప్పించి ఆ స్టోరీని పూరీ చేతిలో పెట్డాడు. అలా చూస్తే వంశీ చేసిన త్యాగం చిన్నదేమీ కాదు. మరి ఆ త్యాగాన్ని తారక్‌ గుర్తిస్తాడా? వంశీకి మాట ఇచ్చినట్లు అతడిని డైరెక్టర్‌ను చేస్తాడా? అలాంటి అవకాశం ఎప్పుడు ఇస్తాడు?  అనేది ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న మాట...!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs