సోషల్ మీడియా ద్వారా సంచలనం సృష్టించి తనకు తాను ‘బర్నింగ్‌స్టార్’గా పిలిచి, పిలిపించుకొని ఎదిగి తన తొలిచిత్రం ‘హృదయకాలేయం’తోనే తనేంటో చూపించి సక్సెస్‌ఫుల్ నటునిగా ఎదుగుతున్న నటుడు, హీరో సంపూర్ణేష్‌బాబు.. ముద్దు పేరు సంపూ. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. కేవలం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా వరుస సినిమాలు చేస్తున్నాడు. టాప్‌స్టార్స్‌కు విరుద్దంగా తన రాకతో.. తన ఫిజిక్‌తో ఆయన చేసే పేరడీ చాలా బాగుంటుంది అనే పేరు ఎప్పుడో తెచ్చుకున్నాడు. అయితే సంపూ ఓ సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత? అనేది అందరి మదిలో ఉండే ప్రశ్న. ఫిల్మ్‌నగర్ సమాచారం ప్రకారం సంపూ ఓ చిత్రంలో నటించినందుకు 25లక్షలు తీసుకుంటాడని, హీరోగా అయితే ఓ ఐదు లక్షల వరకు డిస్కౌంట్ కూడా ఇస్తాడని టాక్.