సమంతకు ఇటీవల కోపం వచ్చింది. అదే తడవుగా తన ట్విట్టర్‌లో ఘాటుగా ట్వీట్ చేసింది. ఇంతకీ ఆమె కోపం ఎవరి మీద అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఆమె ట్వీట్ చేస్తూ... సాధారణంగా నిర్మాతలు షూటింగ్ పూర్తయ్యేసరికి చేతిలో ఉన్న డబ్బులు అయిపోతే మొదటగా ఎగ్గొట్టేది హీరోయిన్ రెమ్యూనరేషనే. సినిమా చేస్తే ఇంత ఇస్తాం.. అంతిస్తాం.. అని ఆశపెట్టి ఆ తర్వాత మా కష్టానికి ఇవ్వాల్సిన ప్రతిఫలం ఇవ్వకపోతే ఖచ్చింగా కోపం వస్తుంది. అలాంటి సంస్థలో మరలా పనిచేసే అవకాశం వచ్చినా చేయాలని అనిపించదు... అంటోంది. మరి ఆమెకు అలా డబ్బులు ఎగ్గొట్టిన నిర్మాత ఎవరు? తెలుగు సినిమాలో ఆ అనుభవం ఎదురైందా? లేక కోలీవుడ్‌లో ఆమెకు ఇలాంటి సమస్య వచ్చిందా? సమంత కోపానికి కారణం ఎవరు? అనేది ఇప్పుడు అందరి మదిలో ఉన్న ఆలోచన...!