Advertisement
Google Ads BL

బాలయ్యకు ‘లయన్‌’ టెన్షన్‌...!


నందమూరి నటసింహం బాలయ్యకు తాజా చిత్రం ‘లయన్‌’ టెన్షన్‌ పెడుతోంది. ఈ చిత్రం బాలయ్య కెరీర్‌కే కాదు.. ఇందులో పనిచేస్తున్న చాలామందికి ఈ చిత్రం ఫలితం అత్యంత కీలకంగా మారింది. వాస్తవానికి బాలయ్యకు అప్పుడప్పుడు పెద్ద పెద్ద హిట్స్‌ వస్తున్నప్పటికీ నిలకడగా ఆయన చిత్రాలు విజయం సాధించలేకపోతున్నాయి. ఈ ట్రెండ్‌కు ఈ సినిమాతో ముగింపు పలకాలని, ‘లెజెండ్‌’ తర్వాత వెంటనే మరో హిట్‌ ఇచ్చి వరుస సక్సెస్‌లు ఖాతాలో వేసుకోవాలని బాలయ్య చూస్తున్నాడు. అలాగే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న మణిశర్మకు ఇది అత్యంత కీలకంగా మారింది. ఈ మధ్య కుర్ర సంగీత దర్శకుల రాకతో ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన మణిశర్మకు లభించిన గోల్డెన్‌ ఛాన్స్‌ ఈ చిత్రం. ఈ చిత్రం విజయం సాధిస్తే ఆయన కెరీర్‌ మరింతకాలంగా సాగుతుంది. లేకపోతే కష్టమే అంటున్నారు. ఇక హీరోయిన్లు త్రిష, రాధికాఆప్టేలకు, కొత్త దర్శకనిర్మాతలైన సత్యదేవా, రుద్రపాటి రమణారావు కెరీర్లకు కూడా ఈ చిత్రం కీలకం కానుంది. మరి బాలయ్య ఇంత మందికి లైఫ్‌ ఇస్తాడో లేదో వేచిచూడాల్సివుంది...! అంతేగాక ‘పటాస్‌, టెంపర్‌’ చిత్రాల ఘనవిజయంతో ఉత్సాహంగా ఉన్న నందమూరి అభిమానులు ఈ ఏడాది నందమూరి నామ సంవత్సరం కావాలంటే ‘లయన్‌’ ఖచ్చితంగా హిట్‌ కావాలని కోరుకుంటూ ఈ చిత్రంపై తమ అంచనాలు పెంచేసుకుంటున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs