మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమాలలో బిజీ గా ఉంటూనే తను చేయాలనుకున్న పనులు చేస్తున్నాడు. చరణ్ కు నటనతో పాటు చాలా అభిరుచులు ఉన్నాయి. కేవలం నటనలోనే కాకుండా అన్ని రంగాలలోను ప్రావీణ్యం పొందాలనుకుంటాడు. కర్నాటక సంగీతం నేర్చుకున్నాడు. మంచి డాన్సర్. వ్యాపారంలో కూడా తన శైలి చూపిస్తున్నాడు. రీసెంట్ గా ఓ షో లో ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని ఉంది అని చెప్పాడు. చరణ్ కు తమిళ భాష మీద మంచి పట్టు ఉంది. ఇప్పుడు తనకి లీజర్ ఉన్న సమయంలో ఫ్రెంచ్ భాషను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. సాదారణంగా హీరోలకు ఖాళీ సమయం దొరికితే తమ బాడీ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే విషయంపైనే కాన్సన్ ట్రేట్ చేస్తారు. రామ్ చరణ్ మాత్రం వాళ్ళందరికీ భిన్నంగా ఉన్నాడు.