సాక్షి యాజమాన్యం ఉద్యోగులపై వేధింపులకు దిగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా దాదాపు 30 శాతం మంది ఉద్యోగాలు ఊడపీకడమే కాకుండా ఇష్టారీతిగా ట్రాన్స్‌ఫర్‌లు చేస్తూ చిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని మీడియా వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఇక అంతేకకాకుండా దాదాపు రెండేళ్లుగా ఉద్యోగుల వేతనాలు కూడా పెంచని యాజమాన్యం.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీ గురించి కథనాలు ప్రచురించడం హాస్యాస్పదమని ఆ సంస్థ ఉద్యోగులే విమర్శిస్తున్నారు. మరోవైపు ఏబీఎన్ టీవీ ప్రసారాలు తెలంగాణలో నిలిచిపోయి ఇప్పటికీ ఆరునెలలు దాటింది. అయినా ఆ సంస్థ యాజమాన్యం ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదని, అంతేకాకుండా వేతనాల చెల్లింపులో కూడా ఎలాంటి సమస్యలు సృష్టించడం లేదని వారు మీడియా వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఒకవేళ ఏబీఎన్ పరిస్థితి 'సాక్షి'కి వచ్చి ఉంటే నిర్దాక్షిణంగా ఉద్యోగులందర్ని ఇళ్లకు పంపించి ఉండేదన్న విషయంలో ఎలాంటి సందేహం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక సాక్షిలో ఉద్యోగాలు పోగుట్టుకొని ఆంధ్రజ్యోతిలో చేరిన వారు మాత్రం జగన్ కంటే రాధాకృష్ణ వందరెట్లు నయమని చెబుతున్నారు.