ఇండస్ట్రీలో జూనియర్ ఇలియానా అని పిలిపించుకుంటున్న నటి రెజీనా.. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా రెండు సినిమాలలో నటిస్తుంది. ఇప్పటి వరకు కొత్త హీరోల సరసన నటించిన ఈ అమ్మడు ఇకపై కొత్తవారితో నటించనంటోందట. అంతేకాదు.. రెండు సంవత్సరాల వరకు కాల్షీట్లు లేవంటుందట. తను సినిమాలో నటించాలంటే కథ, హీరోలతో పాటు రెమ్యునరేషన్ కూడా ఓకే అయితేనే నటిస్తానంటోంది. దీంతో ఈ అప్ కమింగ్ బ్యూటీ టాప్ పొజిషన్ కు చేరుకోవడం కష్టమని సినీ జనాలు సైటర్లు వేస్తున్నారంట. ఇప్పుడిప్పుడే అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ మ్ముద్దుగుమ్మ ఇన్ని కండిషన్స్ పెడితే అవకాశాలు రావడం కష్టం అని ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో..!