ర్మాత బండ్ల గణేష్ అవకాశవాది అని, ఏ హీరోతో సినిమా చేస్తుంటే ఆ హీరో నే తనకు దేవుడని పొగుడుతూ వారిని కాకా పడుతుంటాడనే చెడ్డపేరు ఉంది. కానీ ఇటీవల 'టెంపర్' విజయం తర్వాత ఆయన మాట్లాడిన తీరు చూసిన వారు ఆయనపై తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. 'టెంపర్' చిత్రం షూటింగ్ సమయంలో ఇక బండ్ల గణేష్ పనైపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో నిర్మాతగా తనకు మరో ఐదేళ్ళు డోకాలేదనే ఫీలింగ్ లో గణేష్ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ... నేను మెగా కాంపౌండ్ వ్యక్తిని అనే ఉద్దేశ్యంతో చాలామంది నన్ను అనుమానపు చూపులు చూశారు. ఒకానొక సమయంలో పూరీ, ఎన్టీఆర్ లతో నాకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన మాట నిజమే. అప్పుడు అసలు 'టెంపర్' చిత్రాన్నే ఆపేద్దామనుకున్నాను. నాకు అందరూ హీరోలు కావాలి. హీరోలంతా బాగుంటేనే నేను బాగుంటాను. అయినా పవన్ కళ్యాణ్ నా దేవుడు. ఐప్పటికీ అదే మాట మీద ఉన్నాను. ఎందుకంటే 'తీన్ మార్' ప్లాప్ తర్వాత ఆయన పిలిచి మరీ 'గబ్బర్ సింగ్' అవకాశం ఇచ్చారు... అంటూ వాస్తవాలను వాస్తవంగా ఒప్పుకున్నాడు. ఈ పరిణామం మెగాభిమానులకు మంచి ఆనందాన్నే ఇస్తోందని చెప్పవచ్చు.