తన రాజకీయ ప్రత్యర్ధులైన వై యస్ రాజశేఖర్ రెడ్డి, వై యస్ జగన్ లపై హీరో బాలకృష్ణ ఓ రేంజ్ లో విరుచుకుపడనున్నాడని సమాచారం. తాజాగా బాలకృష్ణ నటిస్తున్న 'లయన్' చిత్రంలో జగన్ ను టార్గెట్ చేస్తూ అనేక పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రలు పోషిస్తున్నాడని, ఒకటి సి.బి.ఐ. ఆఫీసర్ పాత్ర కాగా మరొకటి సామాన్యుడు పాత్ర అని తెలుస్తుంది. సి.బి.ఐ. ఆఫీసర్ జె.డి. లక్ష్మీ నారాయణ స్పూర్తి అంటున్నారు. దీంతో ఇప్పటి నుండే ఈ చిత్రంపై క్యూరియాసిటీ పెరుగుతుంది.