Advertisement
Google Ads BL

ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్..!


ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఆయన సరసన అనుష్క, తమన్నాలు హీరోయిన్లు గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఓ నెలరోజులు గ్యాప్ తీసుకుని ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు. 'రన్ రాజా రన్' డైరెక్టర్ సుజీత్ చెప్పిన స్టోరీ లైన్ ప్రభాస్ కు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రం స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమైన సుజీత్ ఓ మంచి వైవిధ్యమైన స్టోరీని తయారుచేశాడని సమాచారం. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ బేనర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్నారు. వీరు తమ బేనర్ లో మొదటి సినిమాగా ప్రభాస్ హీరోగా 'మిర్చి' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీపొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ద్వారా ప్రభాస్ సరసన ఓ కొత్త హీరోయిన్ నటించనున్నట్లు సమాచారం. మరి ఆ భామ ఎవరో కొద్దిరోజుల్లో వెల్లడవుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ బాడీలాంగ్వేజ్  చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs