Advertisement
Google Ads BL

రామ్ చరణ్-శ్రీనువైట్ల సినిమాలో మార్పులు..!


త్వరలో ప్రారంభం కానున్న రామ్ చరణ్-శ్రీనువైట్ల సినిమాకు తమన్ సంగీతం అందిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ స్థానంలో రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ ను కాకుండా తమిళ కుర్రాడు, కొలవెరి సాంగ్ ఫేమ్ అనిరుధ్ రవిచంద్రన్ ను ఎంపిక చేసారని సమాచారం. '3' చిత్రంలోని 'కొలవెరి' సాంగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రానికి అనిరుధ్ ఏస్థాయి సంగీతాన్ని అందిస్తాడో వేచిచూడాల్సివుంది. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత ను తీసుకోవాలని ముందుగా భావించారు. రచయితలు కోనవెంకట్, గోపీమోహన్ లి ఇదే విషయం ఖరారు చేసారు. కానీ ఆస్థానం నుండి సమంతను తీసివేసి రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తన గత చిత్రాలకు విభిన్నంగా ఉండాలనే కసితో శ్రీనువైట్ల అంత కొత్తదనం కోసం ఆరాటపడుతున్న సంగతి తెలిసిందే. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs