Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ కు జోడీ ఎవరు..?


జూనియర్ ఎన్టీఆర్-పూరిజగన్నాథ్ ల కాంబినేషన్ లో రూపొందిన 'టెంపర్' చిత్రం 13న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత కొద్దిగ్యాప్ లో అంటే మార్చి 1వ తేదీ నుండి ఎన్టీఆర్-సుకుమార్ ల చిత్రం ప్రారంభం కానుంది. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉందట. కాగా ఈ రెండు పాత్రల కోసం దర్శకనిర్మాతలు హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్ ల పేర్లు పరిశీలిస్తునట్లు  సమాచారం. వీరిలో ఎవరైనా ఒప్పుకోకుంటే రిజర్వ్ లో రాశిఖన్నా పేరును కూడా ఉంచారట. కాగా ఈ చిత్రం ఫాదర్ సెంటిమెంట్ తో రివెంజ్ డ్రామాగా తెరకెక్కనుంది. మరి ఎన్టీఆర్ తండ్రిగా ఎవరు నటించనున్నారు? అనే విషయంపై కూడా హాట్ చర్చ సాగుతోంది. కాగా ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs